Least Literate District in India : భార‌త‌దేశంలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఏది..?

భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు కలిగిన జిల్లా ఏదో తెలుసా..? భారతదేశంలో జనాభా గణన 2011లో నిర్వహించారు. ఇది దేశ జనాభాతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థితిగతులు సమాచారాన్ని అందించింది.
Least Literate District in India

ఇలా సేకరించిన డేటాలో ముఖ్యమైన అంశం వివిధ ప్రాంతాలలోని జనాభా, అక్కడి అక్షరాస్యత రేటు. 

అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగిన మొద‌టి.. రెండో జిల్లా..

భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు గల జిల్లాలను గుర్తించడానికి ఈ డేటా ఉపకరిస్తుంది. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగిన జిల్లా అలీరాజ్‌పూర్. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 36.10 శాతం మాత్రమే. ఈ జిల్లాలలో మగవారిలో అక్షరాస్యత రేటు 42.02 శాతం, స్త్రీలలో 30.29 శాతంగా ఉంది. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న రెండవ జిల్లా విషయానికొస్తే.. అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌. ఈ జిల్లాలో సగటు అక్షరాస్యత రేటు 40.86 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 50.46 శాతం. స్త్రీల అక్షరాశ్యత 31.11 శాతంగా ఉంది. 
అత్యల్ప విద్యావంతులు కలిగిన మూడవ జిల్లా దంతేవాడ. ఇది చత్తీస్‌గఢ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 42.12 శాతం. పురుషుల అక్షరాశ్యత శాతం 51.92 శాతం. స్త్రీలలో 35.54 శాతం అక్షరాశ్యత ఉంది.

☛ Richest Persons 2023: ప్రపంచంలో అత్యంత ధనవంతులు 2023 విరే..

భారతదేశంలో అతి తక్కువగా..
మధ్యప్రదేశ్‌లోని ఝబువా సగటు అక్షరాస్యత రేటు 43.30 శాతం. ఇది దేశంలో నాల్గవ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడ పురుషులలో 52.85 శాతం, మహిళలలో 33.77 శాతం అక్షరాశ్యత కలిగినవారున్నారు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న ఐదవ జిల్లా ఒడిశాలోని నబరంగ్‌పూర్. ఇక్కడ నమోదైన సగటు అక్షరాస్యత రేటు 46.43 శాతం. ఇక భార‌త‌దేశంలో అత్యధిక విద్యావంతులు కలిగిన రాష్ట్రం గురించి ప్రస్తావించినప్పుడు కేరళ పేరు గుర్తుకు వస్తుంది.

☛ Mobile Manufacturers in India : ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్‌ ఉత్పత్తి దేశం ఇదే..

#Tags