BrahMos to Philippines: ఫిలిప్పీన్స్ చేతికి బ్రహ్మోస్!
ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్ ఫిలిప్పీన్స్‌కు అందజేసింది..
సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్ ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌లను అందించేందుకు రెండేళ్ల క్రితం 37.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది.
US Report: యూఎస్ మానవహక్కుల నివేదిక.. తీవ్రంగా ఖండించిన భారత్
దీనికింద మూడు బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను ఫిలిప్పీన్స్‌కు భారత్ సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. తాజాగా భారత వాయుసేనకు చెందిన సి–17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు మన దేశం చేరవేసింది.
World Future Energy Summit: 16వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ప్రారంభమైంది ఇక్కడే..
#Tags