TS CET 2024 Notification: టీఎస్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..!

ఉస్మానియా యూనివర్శిటీ.. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌ సెట్‌)–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్‌ పోస్టుల నియామకాల అర్హత కోసం టీఎస్‌ సెట్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

     సబ్జెక్ట్‌లు: జాగ్రఫీ, కెమికల్‌ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌–అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌ సైన్స్, లైఫ్‌ సైన్సెస్, జర్నలిజం–మాస్‌ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమేటికల్‌ సైన్సె­స్, ఫిజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, సంస్కృతం, సోషల్‌ వర్క్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్‌.

Contract Based Posts: సీఎంఎస్‌ఎస్‌ వేర్‌హౌస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు..

     అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
     వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.
     పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌–2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
     ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 14.05.2024.
     ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.07.2024
     దరఖాస్తులో మార్పులకు చివరితేది: 28.07.2024, 29.07.2024.
     హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: 20.08.2024.
     పరీక్ష తేదీలు: 28.08.2024, 29.08.2024, 30.08.2024, 31.08.2024.
     పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌ నగర్, వైజాగ్, నల్గొండ.
     వెబ్‌సైట్‌: http://telanganaset.org

Silver Jubilee Govt College Admissions: సిల్వ‌ర్ జుబ్లీ ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ప‌రీక్ష‌.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌..!

#Tags