Vice Chancellor Posts: వైస్‌చాన్స్‌లర్‌ పోస్టులకు భారీగా దరఖాస్తులు

Vice Chancellor Posts

కర్నూలు కల్చరల్‌: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్‌ పోస్టులకు భారీగా దరఖాస్తులొచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల ఉపకులపతులను రాజీనామాలు చేయించారు. దీంతో ఖాళీ అయిన 17 వర్సిటీల వైస్‌చాన్స్‌లర్ల పోస్టుల భర్తీకి సర్కారు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

MBA And MCA Counseling: ఈనెల 5న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్‌

గత నెల చివరితో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగిసింది. కొందరు ప్రొఫెసర్లు రెండు మూడు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యా మండలి దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనుంది. దీంతో పాటే ప్రతి వర్సిటీకి వీసీల ఎంపికకు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

Dussehra holidays: నేటి నుంచి దసరా సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ నియామకం జరిగితే కానీ స్క్రీనింగ్‌, సెర్చ్‌ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ యూనివర్సిటీకి సుమారు 160 దరఖాస్తులు, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీకి 60 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags