Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..

దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ విభాగంలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1377
అర్హత:  పోస్టును అనుసరించి పదో తరగతి, 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

#Tags