Guest Faculty Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే

కార్వేటినగరం: అతిథి అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయులురెడ్డి తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులు బోధించుటకు తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులు అవసరమన్నారు.

JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎం.కాంలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై కామర్స్‌లో పీహెచ్‌డీ, యూజీసీ నెట్‌ లేదా, ఏపీసెట్‌ లేదా ఏపీ స్లేట్‌ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

University of Hyderabad Recruitment 2024: గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం 'యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌' నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

కంప్యూటర్‌ సైన్స్‌కు ఎంటెక్‌, కంప్యూటర్స్‌ సైన్స్‌, ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంసీఏ కోర్సుల్లో 55 శాతం మార్కులు కలిగి ఉండి, పీహెచ్‌డీ, యూజీసీ నెట్‌, లేదా ఏపీసెట్‌ లేదా ఏపీ స్టేట్‌ పూర్తి చేసి బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు జూలై 31వ తేదీ ఉదయం 11 గంటలకు కళాశాలలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో డెమో తరగతులు ఇవ్వడానికి హాజరు కావాలని కోరారు.
 

#Tags