Guest Faculty Jobs: గురుకులాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గెస్టు ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎన్‌.బాలాజీనాయక్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కొల్లివలసలో జేఎల్‌ మ్యాథ్స్‌ (పురుష అభ్యర్థులు మాత్రమే), కంచిలిలో జేఎల్‌ కెమిస్ట్రీ (పురుష అభ్యర్థులు మాత్రమే), పాతపట్నం బాలికల పాఠశాలలో టీజీటీ బయోలాజికల్‌ సైన్సు, పీజీటీ సోషల్‌ స్టడీస్‌ (మహిళ అభ్యర్థులు మాత్రమే), ఎచ్చెర్లలో జేఎల్‌ జువాలజీ (మహిళ అభ్యర్థులు మాత్రమే) పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Ts Dsc Hall Tickets: అబ్బాయి హాల్‌ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్‌ టికెట్లలో గందరగోళం

ఆసక్తి గల పురుష, మహిళ అభ్యర్థులు వారి బయోడేటాతో పాటుగా పీజీ, బీఈడీ, టెట్‌ (క్వాలిఫైడ్‌) ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఆదివారంపేటలోని జిల్లా సమన్వయాధికారి కార్యాలయానికి ఈనెల 18 తేదీన ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08942–279926, 9701736862, 9000314209 నంబర్లను సంప్రదించాలని కోరారు.
 

#Tags