TSEAP set 2024: టీఎస్ఈఏపీ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ ప్రారంభం.. పేప‌ర్లు ఇలా వ‌చ్చాయి..!

నిన్న.. అంటే, మంగ‌ళ‌వారం అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ, ఇంజనీరింగ్ క‌ళాశాలల్లో ప్ర‌వేశానికి పరీక్ష‌ల నిర్వాహ‌ణ ప్రారంభ‌మైంది. అయితే, ప‌రీక్ష‌ను రాసిన కొంద‌రు విద్యార్థులు స్పందిస్తూ పేప‌ర్లు ఎలా వ‌చ్చాయో వివ‌రించారు..

హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష‌ (టీఎస్‌ఈఏపీ సెట్‌) మంగళవారం మొదలైంది. తొలి రోజు జరిగిన పరీక్షకు 90.41 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్‌ నిర్వహిస్తున్నారు. 

ఈ నెల 9 నుంచి 11 వరకూ ఇంజనీరింగ్‌ సెట్‌ ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి మొత్తం 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌గా జరిగిన ఈ పరీక్షను ఉదయం, సాయంత్రం నిర్వహించారు. ఈ రెండు పూటలకు కలిపి 33,500 మంది హాజరవ్వాల్సి ఉంది. అయితే, 30,280 (90.41%) మంది హాజరయ్యారు. 

IIT Madras Raises 513 Crore In Donations:  ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థులు, దాతల నుంచి భారీ విరాళాలు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలిరోజు పరీక్ష జరిగిందని ఈఏపీ సెట్‌ కో–కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన విధించినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్‌ నేడు (బుధవారం) కూడా జరుగుతుంది.

Pulitzer Prize Winners: 2024 పులిట్జర్ బహుమతులు.. విజేతల పూర్తి జాబితా ఇదే..

ఫిజిక్స్‌ కాస్త టఫ్‌
ఈఏపీ సెట్‌లో ఫిజిక్స్‌ విభాగం నుంచి కఠిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. సిలబస్‌ నుంచే ఇచ్చినప్పటికీ సమాధానాలు డొంక తిరుగుడుగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి నీలేష్‌ తెలిపారు. కఠినమైన ఫిజిక్స్‌ చాప్టర్స్‌ నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని, కొన్ని లెక్కలు వేయడం వల్ల ఇతర సబ్జెక్టులకు సమయం సరిపోలేదని వరంగల్‌కు చెందిన ప్రజ్ఞ చెప్పారు. 

Panama Election: పనామా అధ్యక్ష ఎన్నికల్లో విజ‌యం సాధించిన జోస్ రౌల్ ములినో

కెమిస్ట్రీ పేపర్‌ మధ్యస్థంగా ఉన్నట్టు ఎక్కువ మంది విద్యార్థులు తెలిపారు. ఆర్గానిక్, ఇనార్గన్‌ చాప్టర్ల నుంచి కొంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా, ఇతర చాప్టర్లు తేలికగానే ఉన్నాయన్నారు. కాగా, మూలకాల విశ్లేషణపై పట్టున్న విద్యార్థులకు కెమిస్ట్రీ తేలికగానే ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు వినోద్‌ త్రిపాఠీ తెలిపారు. అయితే, ఆప్షన్స్‌లో సమాధానాలు ఒకదానితో ఒకటి పోలినట్టే ఉండటం వల్ల విద్యార్థులు సరైన ఆన్సర్‌ ఇవ్వడానికి కష్టపడాల్సి వచ్చిందని మరో రసాయన శాస్త్ర అధ్యాపకుడు బీరేందర్‌ వర్మ అభిప్రాయపడ్డారు. 

Private School Education: ప్రైవేటు పాఠ‌శాల విద్య ఇప్పుడు పేద విద్యార్థుల‌కు కూడా..!

బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రిపేర్‌ అయిన ప్రశ్నలే వచ్చినట్టు మెజారిటీ విద్యార్థులు తెలిపారు. మొత్తం మీద జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్‌ చేసే వీలుందని అధ్యాపకులు చెబుతున్నారు. గత ఐదేళ్ల ఎంసెట్‌ పేపర్లు ప్రిపరేషన్‌కు తీసుకుని ఉంటే ఎక్కువ మార్కులు సాధించే వీలుందని బాటనీ లెక్చరర్‌ శ్రుతి తెలిపారు. 

AP POLYCET Results 2024 : ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఒకే ఒక్క క్లిక్‌తో మీ ర్యాంక్‌ను చెక్‌ చేసుకోండిలా..

#Tags