TET: దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు మార్చి 25 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజి్రస్టేషన్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) స్పష్టం చేసింది.
టెట్‌ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో బులెటిన్ ను మార్చి 24న టెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో పేపర్‌కు రూ. 300 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలంది. దరఖాస్తులను ఏప్రిల్‌ 11 వరకు పంపుకోవచ్చని, జూన్ 6 నుంచి హాల్‌ టికెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. టెట్‌ సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రశ్నలు రెండు భాషల్లో ఉంటాయని తెలిపింది. టెట్‌ ఉత్తీర్ణత సరి్టఫికెట్‌ ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు, ఇది సాధ్యం కాకపోతే జీవితకాలం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌ అభ్యర్థులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని పేర్కొంది. 

ఎవరు రాయొచ్చు?

  • పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఇంటర్‌తో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) పూర్తి చేసిన వారు పేపర్‌–1 రాయాలి. డిగ్రీ సహా బీఈడీ చేసిన అభ్యర్థులు పేపర్‌–2 (సైన్స్, సోషల్‌ వేర్వేరుగా)కు దరఖాస్తు చేసుకోవాలి. భాషా పండితులు, బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకూ టెట్‌ రాసే అవకాశం ఉంటుంది. 
  • టెట్‌ పేపర్‌–1 అర్హత పొందిన వారు 1–5 తరగతులు, పేపర్‌–2 అర్హత సాధించిన వారు 6, ఆ పై తరగతులు బోధించేందుకు అర్హత పొందుతారు. పేపర్‌–2 రాసే అభ్యర్థులు పేపర్‌–1 కూడా రాయొచ్చు. అంటే 1–5 తరగతులు బోధించే టీచర్‌ ఉద్యోగాలకూ పోటీపడే అర్హత పొందుతారు. 

ఇదీ సిలబస్

  • టెట్‌ పరీక్ష రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది. మొత్తం 150 మార్కులుంటాయి. అన్నీ మలి్టపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. 
  • చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ మరియు బోధన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొదటి భాషకు సంబంధించి 30, రెండో భాష నుంచి 30, మ్యాథమెటిక్స్‌ 30, ఎని్వరాన్ మెంట్‌ స్టడీస్‌ నుంచి 30 ప్రశ్నలుంటాయి. 
  • చైల్డ్‌ డెవలప్‌మెంట్, విద్యాబోధనలో విద్యా మానసిక సంబంధ విషయాలకు ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థులు తెలుగు సహా మొత్తం 8 భాషలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రాంతీయ సిలబస్‌లోనే ప్రశ్నలుంటాయి.  
  • సంబంధిత సబ్జెక్టుల్లో సబ్జెక్టు నుంచి 24 ప్రశ్నలు, విద్యా బోధనకు సంబంధించి 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ సైన్స్ లో చరిత్ర, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ 48 మార్కులు, విద్యా బోధనకు 12 మార్కులు ఉంటాయి. 
  • 150 మార్కుల టెట్‌కు జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు. దివ్యాంగులు కనీసం 40 శాతం మార్కులు పొందితే అర్హులుగా పరిగణిస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్ లైన్ రిజిస్ర్టేస్టేషన్, ఫీజు చెల్లింపు

మార్చి 26 – ఏప్రిల్‌ 11

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల అప్‌లోడ్‌

మార్చి 26 – ఏప్రిల్‌ 12

హాల్‌ టికెట్ల డౌన్ లోడ్‌

జూన్ 6 నుంచి

పరీక్ష తేదీలు

పేపర్‌ – 1

జూన్ 12 ఉదయం 9.30 – మధ్యాహ్నం 12 గంటలు

పేపర్‌ – 2

జూన్ 12 మధ్యాహ్నం 2.30 – సాయంత్రం 5 గంటలు

ఫలితాల వెల్లడి

జూన్ 27  

#Tags