AP RCET: ఫలితాల విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఆర్సెట్–2021 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి డిసెంబర్ 31న విడుదల చేశారు.
ఏపీఆర్‌సెట్‌ ఫలితాల విడుదల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 12,370 మంది దరఖాస్తు చేయగా, డిసెంబర్ 7 నుంచి 10 వరకు నిర్వహించిన అర్హత పరీక్షలకు 9,933 మంది హాజరయ్యారని, 49.4 శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపారు. యూజీసీ, ప్రభుత్వ నిబంధనల మేరకు ఓసీలకు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించినట్టు చెప్పారు. అర్హత సాధించిన వారిలో 2,826 మంది పురుషులు, 2,082 మంది స్త్రీలు ఉన్నట్టు వెల్లడించారు. ఇంటర్వూ్య తేదీలు తదితర వివరాలకు https://sche.ap.gov.in/RCET/RCETHomePage.aspx అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. వారితో పాటు క నీ్వనర్ వి.శ్రీకాంత్రెడ్డి, రిజి్రస్టార్ హుస్సే¯ŒS తదితరులున్నారు.

చదవండి: 

గ్రూప్‌–1 మెయిన్స్ – 2018 ఫలితాలు సమాచారం

Good News: అడ్వాన్స్ డ్‌కు మరోసారి చాన్స్‌

District Collector: విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు

#Tags