Skip to main content

District Collector: విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు

విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సరి్టఫికెట్ల జారీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ శ్రీకారం చుట్టారు.
District Collector
విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు

తొలుత ప్రయోగాత్మకంగా డిసెంబర్‌ 30న జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరి్టఫికెట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సరి్టఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సరి్టఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్‌ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సరి్టఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సరి్టఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్‌డీఓ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

చదవండి: 

Education: కరోనా వేళ ఇక్కడి విద్యార్థులకు బోధనా విధానాలు భేష్

Education: విద్యకు పెద్దపీట.. ప్రైవేట్ వర్సిటీల్లో పేదలకు సీట్లు..

YouTube: యూట్యూబ్‌ టాపర్లు వీరే.. చదువు, గేమ్‌లు నుండి వినోదం వరకు..

Published date : 31 Dec 2021 05:56PM

Photo Stories