PJTSAU: వ్యవసాయ వర్సిటీలో తగ్గిన ఫీజులు.. పెరిగిన సీట్లు

సాక్షి, హైదరాబాద్‌/ఏజీ వర్సిటీ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా చేరిన వెంటనే ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యంగా ప్రత్యేక కోటా (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) ఫీజులను భారీగా తగ్గించారు. ప్రస్తుతం ప్రత్యేక కోటాలో ఉన్న బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు నాలుగేళ్లకు కలిపి మొత్తం రూ. 10 లక్షల ఫీజు ఉండగా దాన్ని రూ. 5 లక్షలకు తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 21న ప్రకటించారు.

అలాగే ప్రవేశ సమయంలో ఒకేసారి రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 65 వేలు మాత్రమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ విద్యాసంవత్సరంలో ప్రత్యేక కోటా కింద బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో అదనంగా 200 సీట్లను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం సాధారణ కేటగిరీలో 615 సీట్లు, ప్రత్యేక ఫీజుతో సుమారు 227 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా పెంచిన 200 సీట్లను ఈ–కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు సాధారణ సీట్ల ప్రవేశాల కోసం తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తవగా గ్రామీణ విద్యార్థుల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని సీట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వీసీ వివరించారు.

చదవండి: TG Govt appoints VCs: 9 వర్సిటీలకు వీసీల నియామకం.. కోత్త వీసీల గురించి క్లుప్తంగా ఇలా..

అదనంగా పెంచుతున్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో 2–3 రోజుల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని సాంకేతికంగా గుర్తింపులేని కొన్ని ప్రైవేటు సంస్థలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని, అలాంటి సంస్థలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వీసీ సూచించారు.

ఆ జిల్లాల్లోనూ వ్యవసాయ కళాశాలలు..

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్న వివిధ కోర్సులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రవేశ­పెట్ట­నున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ జాన­య్య తెలిపారు. దీంతోపాటు ఉమ్మ­డి జిల్లాల్లో ప్రస్తుతం వ్యవసా­య కళాశాలలు లేని నిజామాబాద్, నల్ల­గొండ జిల్లాల్లోనూ వ్యవసాయ కళా­శా­లలు ఏర్పాటు చేయాలని ప్రభు­త్వా­నికి వర్సిటీ ప్రతిపాదించిందన్నారు. 
 

#Tags