Assistant Professors: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు యూజీసీ తీపి కబురు..

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు యూజీసీ తీపి కబురుచెప్పింది.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు యూజీసీ తీపి కబురు..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల్లో నియామకాలకు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలన్న నిబంధనకు తాత్కాలికంగా సడలింపు ఇచ్చింది. 2023 జూలై వరకూ సడలింపు వర్తిస్తుందని పేర్కొంటూ అక్టోబర్‌ 12న ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలను పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలంటూ 2018లో యూజీసీ నిబంధనలు తెచి్చంది. 2021 జూలై నుంచి ఆ నిబంధనను కచి్చతంగా అమలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. అయితే 2020 ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా ప్రభావం మొదలవడం, లాక్‌డౌన్లు, కోవిడ్‌ నిబంధనల కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. పలు సంఘాలు ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చాయి. కరోనా ఉధృతి తగ్గేవరకూ గతంలో మాదిరిగానే పీహెచ్‌డీతో పనిలేకుండా నియమకాలు చేపట్టాలని కోరాయి. ఈ మేరకు పలు రాష్ట్రాలు నిబంధన సడలింపు కోరుతూ యూజీసీకి ప్రతిపాదనలు పంపాయి. యూజీసీ అధికారులు ఈ అంశంపై అధ్యయనం చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతితో సడలింపు ఇచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి దీనితో కొంత ఊరట లభించనుంది.

చదవండి: 

బాలికలకూ శుభవార్త.. ఈ ఏడాది నుంచి ఈ స్కూళ్లు, కాలేజీలో అడ్మిషన్లు

పెట్రోల్ బంక్ వ‌ర్క‌ర్ కుమార్తెను..అభినందించిన ఐఓసీఎల్‌ చైర్మ‌న్

#Tags