APREIS: ఏపీఆర్‌జేసీ డీసీ సెట్, ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌’

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం మే 20న నిర్వహించనున్న ఏపీఆర్‌జేసీ డీసీ సెట్‌–2023కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు చెప్పారు.
ఏపీఆర్‌జేసీ డీసీ సెట్, ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌’

గుంటూరు కొరిటెపాడులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన మే 18న  వివరాలు వెల్లడించారు. డీసీ సెట్‌కు 295 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మే 20 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

చదవండి: APREIS: కాంట్రాక్టు సిబ్బంది రెన్యువల్‌కు మార్గదర్శకాలు

అదే విధంగా ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 5వ తరగతితోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు మొదటి సారిగా నిర్వహిస్తున్న ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌–2023కు రాష్ట్ర వ్యాప్తంగా 165 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పా రు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

చదవండి: గురుకుల జూనియర్ కళాశాలల్లో 96.9 శాతం ఉత్తీర్ణత

#Tags