Anurag CET 2024: అనురాగ్‌ సెట్‌ ప్రవేశ పరీక్ష తేదీలు విడుద‌ల‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనురాగ్‌ ప్రైవేటు యూనివర్సిటీలో ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, నర్సింగ్‌ తదితర కోర్సుల్లో 2024–25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఫిబ్ర వరి 11 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహి స్తున్నట్లు అనురాగ్‌ వర్సిటీ సీఈఓ ఎస్‌. నీలిమ తెలిపారు.

విద్యార్థులు ఫిబ్ర వరి 10 వరకు ఆన్‌లైన్‌లోరిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాలాజీ ఉట్ల, డైరెక్టర్‌ పల్లా అనురాగ్‌తో కలిసి అనురాగ్‌ సెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

చదవండి: TS CETS 2024 Dates Release: సెట్లు తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌.. షెడ్యూల్‌ ఇదే

అనురాగ్‌ సెట్‌–2024లో టాపర్లకు రూ.6.5కోట్ల స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎలాంటి ఎంట్రన్స్‌ ఫీజు లేదని, ఉచితంగానే  https://anurag.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

#Tags