TG PECET 2024: బీపీఈడీ తొలి విడతలో 753 సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులకు సంబంధించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ల కేటాయింపు జరిగింది.

ఈ కోర్సులకు సంబంధించి కన్వీనర్‌ కోటా కింద మొత్తం 1,737 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 967 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 753 మందికి సీట్లు కేటాయించారు.

చదవండి: Collector Kumar Deepak: పదో తరగతి విద్యార్థులకు టీచర్ గా కలెక్టర్!

విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లోనే జాయినింగ్‌ లెటర్‌తో పాటు రశీదును డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలంగాణ పీఈసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు ఆగ‌స్టు 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత అలాట్‌ అయిన కాలేజీల్లో ఆగ‌స్టు 23 నుంచి 28 వరకు విద్యార్థులు రిపోర్టు చేయాలని, ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో వెళ్లి వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

ఒరిజినల్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను సంబంధిత కాలేజీకి పంపుతామని తెలిపారు. ఈనెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.   

#Tags