TCS Jobs 2024 : గుడ్‌న్యూస్.. 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇంకా ఉద్యోగాలకు భారీగా ఇంక్రిమెంట్స్..!
సాక్షి ఎడ్యుకేషన్ : ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారీగా 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రకటించింది.
ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్‌లో తాము ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్- జూన్ మధ్యలో నియమించుకున్న 5,452 మంది కంపెనీ వృద్ధిలో కీలకపాత్ర పోషించారంది. ఉద్యోగులకు 4.5%-7% ఇంక్రిమెంట్ ఇచ్చామన్నారు. ఇంకా మరింత మెరుగ్గా పని చేసినవారు 10%-12% అందుకున్నట్లు వివరించింది. కొత్త టాలెంట్‌కు భారత్ గమ్యస్థానంగా ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారదని పేర్కొంది.
#Tags