VITEEE 2024: విట్‌ ఈఈఈ 2024 ప్రవేశ పరీక్షలు ప్రారంభం.. ఫలితాల తేదీ!

ఈ నెల 19 నుంచి ప్రారంభమైన విఐటి ఈఈఈ–2024 ప్రవేశ పరీక్షలు 30 వరకు జరగనున్నాయి. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు అధికారులు..

తాడికొండ: వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో విఐటి ఈఈఈ–2024 (పవేశ పరీక్షలు) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుంచి 30 వరకు వెల్లూరు, చైన్నె, అమరావతి (ఆంధ్రప్రదేశ్‌), భోపాల్‌ క్యాంపస్‌లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీటెక్‌ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ కోసం ప్రతి ఏటా కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారని, దేశ వ్యాప్తంగా 125 నగరాలు, విదేశాలలోని 6 నగరాలలోని పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.

TS Inter Results 2024 Link : క్లారిటీ.. టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాలు 2024 విడుద‌ల తేదీ ఇదే.. ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్‌..

ఫలితాలు మే 3న తమ వెబ్‌సైట్‌లో ఉంటాయని వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌.వీ కోటారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మూడు స్లాట్లలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు వర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి తెలిపారు.

Summer Camp: విద్యార్థులకు వేసవి కోచింగ్‌ క్యాంపులు..

#Tags