Engineering Seats: యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మండలి గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అ నుమతించింది.

ఇందుకు సంబంధించిన విధివిధానాలను జూలై 31న‌‌ వెల్లడించింది. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రైవేటు కాలేజీలు ఆగస్టు 1 నుంచి 13 వరకు ప్రధాన పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు 6 రోజుల గ డువు ఇవ్వాలి. రాష్ట్రంలోని 1.11 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉంటే, అందులో 30% యాజమాన్య కో టాగా భర్తీ చేస్తారు. ఇందులో 15% ఎన్‌ఆర్‌ఐ లకు కేటాయిస్తారు. ఈ కేటగిరీ కింద సీట్లు పొందే విద్యార్థులు ఎన్నారైలు స్పాన్సర్డ్‌ చేసిన వారై ఉండాలి.

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

సంబంధిత సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో అర్హత పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి. మిగిలిన 15 % సీట్లను తొలుత జేఈఈ లో ర్యాంకు ఆధారంగా, తర్వాత ఎంసెట్‌లో ర్యాంకు ఆ ధారంగా కేటాయించాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 45 శాతం కనీస మార్కులు కలిగి ఉండాలి.

ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 28తో ముగించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కల్పించిన వారి జాబితాను కాలేజీలు సెప్టెంబర్‌ 10లోగా వెల్లడించాల్సి ఉంది. యాజమాన్య కో టాకు సంబంధించిన సీట్లు ఇప్పటికే భర్తీ అయినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో, మండలి నోటిఫికేషన్‌ ఇవ్వడం విశేషం.  

#Tags