M Tech Admissions: హెచ్‌సీయూలో ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూని వర్సిటీలో గేట్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఎంటెక్‌ కోర్సులో స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎంటెక్‌లోని బయోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సులో 17 సీట్లు, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌లో 18 సీట్లు, నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో 18 సీట్లు, మ్యాను ఫ్యాక్చరింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో 18 సీట్లు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ టెక్నాలజీలో 15 సీట్లు, మైక్రో ఎలక్ట్రానిక్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయని, అందులో మళ్లీ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ కేటగిరీలకు రిజర్వ్‌ చేసిన సీట్లు ఉన్నాయని వర్సిటీ వివరించింది.

వెబ్‌ సైట్‌ లింకులో రిజర్వేషన్‌ సీట్లపై సమాచారం చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. జూలై 26వ తేదీ (శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు హెచ్‌సీయూ పరిపాలనా భవనంలోని సీఈ ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.

చదవండి: GATE Notification 2025 Details : గేట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..గేట్‌తో ప్రయోజనాలు..విజయానికి స‌రైన మార్గాలు ఇవే..!

స్పాట్‌ అడ్మిషన్‌ కోసం టెన్త్, 12వ తరగతి, బీటెక్‌/బీఈ/ఎంఎస్‌సీ/ అదర్‌ క్వాలిఫయింగ్‌ డిగ్రీ గ్రేడ్‌ షీట్, బీటెక్‌/ బీఈ/ఎంఎస్సీ, ఇతర క్వాలిఫయింగ్‌ డిగ్రీ ప్రొవిజినల్‌/ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రిజర్వేషన్‌ ఉంటే అందుకు సంబంధించిన ధృవపత్రాలు, వాలీడ్‌ గేట్‌ స్కోర్‌ కార్డు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in లింక్‌ను చూడాలని హెచ్‌సీయూ అధికారులు కోరుతున్నారు. అవసరమైతే ఫోన్‌ నెంబర్‌ 040–23132110లో సంప్రదించాలని అ«ధికారులు సూచించారు. 

#Tags