Engineering Seats Increased 2024 : మ‌రో 9000 ఇంజినీరింగ్ సీట్లు.. రేప‌టి నుంచే వెబ్‌ ఆప్షన్లు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో ఇంజినీరింగ్ సీట్లుకు చాలా డిమాండ్ ఉన్న విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో.. తెలంగాణ‌ రాష్ట్రంలో కొత్తగా మరో 9000 వరకు బీటెక్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

జులై 26వ తేదీ నుంచి రెండో విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభ‌మైంది. 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున జులై 26న లేదా 27న ఉదయం కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇవ్వనుంది.

☛ AP EAPCET Final Phase Counselling: ఇంజనీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. ముఖ్యమైన తేదీలు

రాష్ట్రప్రభుత్వం మాత్రం తొలివిడత కౌన్సెలింగ్‌లో సుమారు 2,600 సీట్లకు అనుమతి ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9,000 వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తిచేశారు.

 TSCHE Chairman Interview on EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై టీఎస్సీహెచ్ఈ చైర్మ‌న్ సూచ‌న‌లు..

#Tags