Engg Fee Reimbursement: ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఈసారి ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, టెక్నికల్ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
డిసెంబర్ 17న సాయంత్రం సచివాలయంలో ప్రైవేట్ కళాశాలల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని, అసెంబ్లీ సమావేశాల తదుపరి బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.
చదవండి: OET for Medical Professionals: మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం ఓఈటీ
ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిల చెల్లింపు అనివార్యమని ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లించాలని నిర్ణయించినట్టు యజమానులకు తెలిపారు.
#Tags