IIIT Basara: బాసర ట్రిపుల్‌ఐటీలో ముగిసిన ఆందోళనలు

భైంసా: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో తెలంగాణ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సాలిడారిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన ఆందోళనలు ముగిశాయి.

సెప్టెంబర్ 9న‌ ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీ సర్, అసోసియేట్‌ డీన్, చీఫ్‌ వార్డెన్, ఇతర అధికారులను పిలిచి విద్యార్థులతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు.

చదవండి: Cancellation of Courses: మహిళా వర్సిటీలో ఈ కోర్సులు రద్దు

విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తా మని అంగీకరించారు. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని క్యాంపస్‌ అధికారులు విద్యార్థులను కోరారు. 

#Tags