Apprenticeship-Cum-Job Fair: ఐటీఐలో పాసైన అన్ని ట్రేడ్స్‌ అభ్యర్థులకు అప్రెంటిస్‌ షిప్‌ మేళా.. ఈ అభ్యర్థులు అర్హులు..

హన్మకొండ అర్బన్‌: నగరంలోని ములుగు రోడ్డులో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో న‌వంబ‌ర్‌ 11న ఐటీఐలో పాసైన అన్ని ట్రేడ్స్‌ అభ్యర్థులకు అప్రెంటిస్‌ షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.సక్రు న‌వంబ‌ర్‌ 5న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈమేళాలో పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఐటీఐ పాసైన 28 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని మేళాకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు బయోడేటా ఫామ్‌, ఎస్సెస్సీ మెమో, ఐటీఐ మెమో/ఎన్‌టీసీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు 2 వెంట తెచ్చుకోవాలని సూచించారు.

చదవండి: Japanese Language: జాపనీస్‌ భాషలో శిక్షణ.. జపాన్‌లో ఉద్యోగం..!

వైద్యారోగ్యశాఖలో భర్తీ పూర్తి

ఎంజీఎం: హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద వివిధ కేడర్లలో న‌వంబ‌ర్‌ 5న అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎంపిక చేసినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఫిబ్రవరి–24లో నోటిఫికేషన్‌కు సంబంధించి ఎంఎల్‌హెచ్‌పీ 4, స్టాఫ్‌ నర్సులు 15, టీబీ వైద్యాధికారి 1, ల్యాబ్‌ టెక్నీషియన్లు 5, పీపీఎం కో–ఆర్డినేటర్‌ 1, డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ 1, ఫార్మసిస్ట్‌ 1 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శ్రీలత, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ గౌతమ్‌ చౌహాన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి రాజేశ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ వేణు, సీనియర్‌ అసిస్టెంట్లు ఫాతిమా, మల్లారెడ్డి, నవీన్‌ పాల్గొన్నారు.

25లోగా ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

కాళోజీ సెంటర్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వార్షిక పరీక్ష ఫీజును ఈనెల 25లోగా చెల్లించాలని వరంగల్‌ డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ న‌వంబ‌ర్‌ 5న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 4 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.520 ఫీజు చెల్లించాలని, సైన్స్‌, ఒకేషనల్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు రూ.230 అదనంగా చెల్లించాలని సూచించారు. అన్ని కశాశాలల ప్రిన్సిపాళ్లు బోర్డు ఆదేశాలను తప్పక అమలు చేయాలని పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అకడమిక్‌ వాతావరణాన్ని సృష్టిద్దాం

కేయూ క్యాంపస్‌: యూనివర్సిటీలో మంచి అకడమిక్‌ వాతావరణాన్ని సృష్టిద్దామని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. న‌వంబ‌ర్‌ 5న కేయూలోని కమిటీ హాల్‌లో హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకతీయ జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌–18వ వాల్యూమ్‌ను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి, సోషల్‌ సైన్స్‌ విభాగాల డీన్‌ ప్రొఫెసర్‌ టి.మనోహర్‌, విభాగాధిపతి చిలువేరు రాజ్‌కుమార్‌, విశ్రాంత ఆచార్యులు కె.విజయబాబు, అధ్యాపకులు ఎం.బ్రహ్మయ్య, కేవీఎస్‌ నరేందర్‌, ఎంకే సుమంత్‌, కె.నాగేశ్వర్‌రావు, బి.శ్రీధర్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

#Tags