TS EAPCET 2024 Results Details: ఈఏపీసెట్ ఫలితాలు సమాచారం.. ‘కీ’పై అభ్యంతరాలకు నేటివరకు గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిం చిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీసెట్) ఫలితాలు మే 25వ తేదీలోగా విడుదల కానున్నాయి.
దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తు న్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇంజనీరిం గ్ సెట్ ప్రాథమిక కీ ని మే 12న విడుదల చేశారు.
కచ్చితమైన సమాధానాలతో కూడిన రెస్పాన్స్ షీట్ తమ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉందని సెట్ కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే సోమవారంలోగా తెలియజేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మే 7 నుంచి 11వ తేదీ వరకూ ఈఏపీసెట్ జరిగింది.
చదవండి: TS EAPCET Answer Key 2024 Out Now: టీఎస్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ రెస్పాన్స్ షీట్ను మే 11వ తేదీన విడుదల చేశారు. రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్కు 2,05,351 మంది, అగ్రి, ఫార్మసీ సెట్కు 1,15,332 మంది హాజరయ్యారు. సెట్ రిజల్ట్ రోజే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
#Tags