TS EAPCET 2024: టీఎస్‌ ఈఏపీసెట్‌–2024కు సర్వం సిద్ధం.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి మే 7 నుంచి 11వ తేదీ వరకూ జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ ఈఏపీసెట్‌–2024)కు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు ఉంటా యని చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్‌కు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ మొదలైందని, ఇంజనీరింగ్‌ సెట్‌కు మే 1 సాయంత్రం 3 గంటల నుంచి మొదలవు తుందని వివరించారు. ఏప్రిల్ 29న‌ జేఎన్‌టీయూహెచ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెట్‌కు 34,120 దరఖాస్తులు పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా 20 కేంద్రాలు ఏర్పాటు చేశాం.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ఇంజనీరింగ్‌కు 166, అగ్రి, ఫార్మసీకి 135 (ఏపీతో కలిపి) పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు తాజా ఫోటో, గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందే చేరుకోవాలి. సెట్‌ రోజే ఇతర పరీక్షలుంటే మెయిల్‌ ద్వారా తెలియజేసినట్టైతే వేరే తేదీని కేటాయిస్తాం. పరీక్ష కేంద్రంలో బయో మెట్రిక్‌ హాజరును అమలు చేస్తాం..’ అని ప్రొఫెసర్‌ లింబాద్రి వివరించారు. 

>> Sakshi EAPCET & NEET Grand Mock Test 2024 Click here for Registration

నెలఖారులోగా సెట్‌ ఫలితాలు

ప్రశ్నలు 40 శాతం అతి సామాన్యంగా, 40 శాతం మధ్యస్థంగా, 20 శాతం మాత్రమే క్లిష్టంగా ఉంటాయని సెట్‌ కో–కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. పరీక్ష హాలులో వాటర్‌ బాటిల్స్‌తో సహా అన్నీ తామే అందిస్తామని, ఎన్నికల సమయంలో ర్యాలీల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా పోలీసుశాఖ సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్ష ఫలితాలను మే నెలాఖరులోగా వెల్లడిస్తామన్నారు.

>> College Predictor - 2023 AP EAPCET TS EAMCET

ఈఏపీసెట్‌ ప్రశ్నపత్రం రూపకల్పనకు 15 విభాగాలతో సమన్వయం చేసుకున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్, ఈఏపీసెట్‌ కన్వీనర్‌ దీన్‌కుమార్, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమైన సూచనలు...

  • పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటాయి.
  • బయోమెట్రిక్‌ హాజరుకు 20 నిమిషాల సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
  • వేలికి ఎలాంటి మెహిందీ, టాటూస్, ఇంక్‌ వంటివి అంటించుకోకూడదు. ఇది బయోమెట్రిక్‌కు ఇబ్బంది కల్గిస్తుంది.
  • పరీక్ష హాల్లోకి బ్లూ, బ్లాక్‌ పాయింట్‌ పెన్, హాల్‌ టికెట్, అవసరమైన ధ్రువపత్రాలను మాత్రమే అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్, ఎలక్ట్రానిక్స్‌ అనుమతించరు.
  • లేటెస్ట్‌ ఫొటోతో కూడిన ఫిల్‌ చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తుపై ఎడమ వేలిముద్ర ఉండాలి. ఇన్విజిలేటర్‌ సమక్షంలో దానిపై సంతకం చేయించుకుంటారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్, రఫ్‌ నోట్స్‌ను పరీక్ష హాలులో పరీక్ష పూర్తయ్యాక అప్పగించాలి. 
  • విద్యార్థులు ఫోటో గుర్తింపు కార్డుగా కాలేజీ ఐడీ కార్డు, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ.. ఇందులో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి. 
  • ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటాయి. ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు ఒకవేళ అవి అర్థం కాకపోతే ఇంగ్లిష్‌ భాషనే ప్రామాణికంగా తీసుకోవాలి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలు తలెత్తితే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాలి. 

సెట్‌కు దరఖాస్తులు గత ఏడాది... ఈ సంవత్సరం

విభాగం

రాష్ట్రం

2023

2024

ఇంజనీరింగ్‌

ఏపీ

51,481

49,071

ఇంజనీరింగ్‌

తెలంగాణ

1,53,890

2,05,472

అగ్రి, ఫార్మసీ

ఏపీ

20,743

12,349

అగ్రి, ఫార్మసీ

తెలంగాణ

94,589

87,911

#Tags