TS Eamcet Special Phase Counselling 2023 : ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.
TS Eamcet Special Phase Counselling 2023 Details

తుది విడత కౌన్సెలింగ్‌ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుగుతాయని కన్వీనర్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. చివ‌రి విడ‌త  కౌన్సెలింగ్‌లో..  మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగ‌స్టు 17వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.

BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

ఆగ‌స్టు 17వ తేదీన‌ స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. 23న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ ప్రవేశాల కోసం అదే రోజున మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వాకాటి కరుణ తెలిపారు.

AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?

#Tags