TS Engineering Seats Increased 2023 : విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు ఇవే.. మరో 14,565 ఇంజనీరింగ్ సీట్ల పెంపు.. ఇంకా..
మొత్తం 14,565 సీట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇటీవల 86,106 సీట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య l,00,671 చేరింది.
☛ TS EAMCET 2023 కౌన్సెలింగ్ కోసం ఇంజనీరింగ్ కళాశాలలు, కోర్సులు, ఫీజుల జాబితా!
ఇప్పటికే ఎంసెట్ రాసిన అభ్యర్థులకు..
చాలా మంది విద్యార్థులు కోర్ గ్రూపుల్లో చేరకపోవడంతో సీట్లు వెనక్కి ఇచ్చి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను పెంచవల్సిందిగా కాలేజీలు అనుమతి కోరాయి.ఈ కోర్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో 6930 సీట్లకు తాజాగా అనుమతి లభించింది. కొత్తగా మరో 7,635 ఇంజినీరింగ్ సీట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ పెంచిన సీట్లతో ప్రభుత్వంపై ప్రతీ సంవత్సరం రూ.27.39కోట్ల భారం పడనుంది. ఇప్పటికే ఎంసెట్ రాసిన అభ్యర్థులకు ర్యాంక్ ప్రకారం కౌన్సెలింగ్ కొనసాగుతుండగా.. వెబ్ ఆప్షన్లు జూలై 08 వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. :
☛ జూలై 07, 08 వ తేదీలలో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.
☛ జూలై 9న వెరిఫికేషన్ ఉంటుంది.
☛ జూలై 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు పొడగించారు.
☛ జూలై 16న తొలి విడత కౌన్సెలింగ్
☛ 24న రెండో విడత కౌన్సెలింగ్
☛ ఆగస్టు 4న తుది కౌన్సెలింగ్
☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెలక్ట్ చేసుకుంటే మంచిదంటే..?