AP EAMCET College Predictor 2023 : ఏపీ ఎంసెట్‌-2023లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..? ఈ లింక్ క్లిక్ చేయండి.. చెక్ చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెల్సిందే. ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.
AP EAMCET 2023 College Predictor

ఎంసెట్‌లో మీకు వ‌చ్చిన‌ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజ‌నీరింగ్‌ కాలేజీ వ‌చ్చిందో..?

ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం ఎంసెట్‌లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా.. ఏఏ కాలేజీలో సీటు వ‌చ్చే అవ‌కాశం ఉందో తెలియ‌జేయ‌నున్న‌ది. ఇది కేవలం ఒక అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. ఇది 2022 సంవ‌త్స‌రంలో ఎంసెట్‌ ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజ‌నీరింగ్‌ కాలేజీ వ‌చ్చిందో అనే దాని ఆధారంగా.. AP EAPCET College Predictor ను ఇవ్వ‌నున్న‌ది. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేసే ఆధారంగానే మీ కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

➤☛ AP EAPCET College Predictor (Click Here)

ఇంటర్‌ మార్కులకు 25శాతం చొప్పున.. 

మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి  3,38,739 మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఇంజ‌నీరింగ్‌కు 224724 మంది ప‌రీక్ష రాశారు. ఇంజ‌నీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్‌లో 90573 ప‌రీక్ష రాయ‌గా.. వీరిలో 81203 మంది అర్హ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్‌లో 89.66 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. విద్యార్థులు సాధించిన ఇంటర్‌ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకులను ప్రకటించారు.

➤☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే మంచిదంటే..?

#Tags