TS DSC 2024 Postpone Update : టీఎస్ డీఎస్సీ-2024 వాయిదా పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8లో నిర్వహించడానికి ఇప్పటికే తేదీలు ప్రకటించింది. అయితే డీఎస్సీకి గ్రూప్–2 కు మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసి.. డీఎస్సీ-2024 పరీక్షలు యధాతధంగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు విద్యా శాఖకు.., తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వాలు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
గ్రూప్-2 వాయిదా..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న గ్రూప్-2 వాయిదా వేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జూలై 6వ తేదీన (శనివారం) రానున్నది. అలాగే TSPSC గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయిదాకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ గ్రూప్-2 పోస్టులను పెంచి.. ఈ పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
☛ TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేదంటే..!