TS TRT Applications : నేడే టీఆర్‌టీ 2023 ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ.. ప‌రీక్ష‌లు మాత్రం..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం 5089 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను సెప్టెంబ‌ర్ 8వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే డీఎస్సీ ద‌ర‌ఖాస్తు గడువు అక్టోబర్ 21 తో ముగియనుండగా.. అభ్య‌ర్థుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 28 వరకు దరఖాస్తు గడువు పెంచుతూ విద్యాశాఖ కీల‌క‌ నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే.
ts trt apply last date 2023

పెంచిన ద‌ర‌ఖాస్తు గ‌డువు కూడా నేటితో (అక్టోబ‌ర్ 28వ తేదీ) ముగియ‌నున్న‌ది. ఇప్ప‌టికి ఇంకా ఎవ‌ర‌న్నా ద‌ర‌ఖాస్తు చేసుకోకుండా నేటి అర్ధ‌రాత్రి వ‌ర‌కు స‌మ‌యం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ విడులైన విష‌యం తెల్సిందే.  ఈ పోస్టుల్లో 2,598 మహిళలకు, 2,491 పురుషులకు దక్కనున్నాయి. జనరల్‌ విభాగంలోనూ పురుషులతో మహిళలు పోటీపడతారు. ఫలితంగా 55-60% ఉద్యోగాలు వారు సొంతం చేసుకోనున్నారు. మొత్తం 2,575 ఎస్‌జీటీ పోస్టుల్లో దాదాపు 2 వేల వరకు తెలుగు మాధ్యమానివే ఉన్నాయి.

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ప‌రీక్షావిధానం ఇలా..
ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో జరుగుతుంది. స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ, భాషా పండితులకు నిర్వహించే పరీక్షల్లో 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అర మార్కు చొప్పున 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీరికి టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే మొత్తం 100 మార్కులకు పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు కేటాయిస్తారు. ఇక పీఈటీ, పీఈడీలకు టెట్‌ అవసరం లేదు. అందువల్ల వారికి 100 మార్కులకు టీఆర్‌టీ నిర్వహిస్తారు.

☛ TRT Syllabus Change : మారిన టీఆర్టీ సిల‌బ‌స్‌.. ఇక‌పై ఇవి చ‌ద‌వాల్సిందే..

ప‌రీక్ష‌ల తేదీలు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో డీఎస్సీ ప‌రీక్ష‌ల తేదీల‌ను మార్పు చేసిన విష‌యం తెల్సిందే. వాయిదాప‌డ్డ‌ ఈ డీఎస్సీ పరీక్షలు.. జనవరి 2024 చివరి వారం లేదా ఫిబ్రవరి 2024 మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టీఆర్‌టీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

#Tags