AP Mega DSc Notification 2024 : పండ‌గ సంద‌ర్భంగా.. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్పింది. ఇటీవ‌లే ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 & 2 నోటిఫికేష‌న్ ఇచ్చి.. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కూడా ప్రారంభించిన విష‌యం తెల్సిందే.

అలాగే ఏపీపీఎస్సీ ఇటీవ‌లే నాలుగైదు నోటిఫికేష‌న్లు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ల‌క్షల మంది ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. అది సంక్రాంతి పండుగ పూట.. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  జ‌న‌వ‌రి 13వ తేదీన (శనివారం) సాయంత్రం ప్రకటించారు.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌తో మెగా డీఎస్సీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందని.. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారాయన.

#Tags