Again TS TET and DSC Notification : మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే...? అలాగే టెట్ కూడా.. ఈ సారి ఈ పోస్టుల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇటీవ‌లే డీఎస్సీ-2024 ఫైన‌ల్ ఫ‌లితాలు విడుద‌ల చేసి... ఉద్యోగాలు కూడా ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే ఈ డీఎస్సీ-2024లో ఉద్యోగం రాని వారు మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబ్ కాలెండ‌ర్ ప్ర‌కారం... వ‌చ్చే 2025 ఫిబ్రవరి 25వ తేదీన డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి... 2025 ఏప్రిల్ 25వ తేదీన ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. రానున్న డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు 4 నెల‌ల స‌మ‌యం ఉంది. 5000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తామని గ‌తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయితే అప్పుడు ప‌రిస్థితుల బ‌ట్టి ఈ పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవ‌కాశం ఉంది.

☛➤Inspirational Success Story : టెన్త్ ఫెయిల్ అయ్యాక‌... లారీ మెకానిక్‌గా చేశా...పాలు, పేప‌ర్‌ వేశాను... ఈ క‌సితోనే చ‌దివి... గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కొట్టానిలా...

వ‌చ్చే నెలలో టెట్‌-2024 నోటిఫికేష‌న్ :
వచ్చే న‌వంబ‌ర్‌ నెలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2024 (టెట్) నోటిఫికేషన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.వచ్చే ఏడాది 2025 జనవరిలో టెట్ రాతపరీక్షలను నిర్వహిస్తుంది. 

త్వరలోనే సుమారు 1,500 మందికి...
డీఎస్సీ-2008 ఉపాధ్యాయులకు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)గా కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే సుమారు 1,500 మందికి ఉద్యోగాలను కల్పించనుంది.

☛➤ Inspiration Success Story : ఫోన్‌ సిగ్నల్‌ ఉన్న చోట కూర్చుని.. యూట్యూబ్‌ వీడియోల సాయంతో... ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించానిలా.. కానీ

#Tags