DSC 2024 Free Coaching: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీ ఉచిత శిక్షణ

ఖమ్మం మయూరి సెంటర్‌: డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఖమ్మంలోని స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ తెలిపారు.

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 100మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టీటీసీ లేదా బీఈడీ ఉత్తీర్ణులై టెట్‌ అర్హత సాధించిన వారు అర్హులని తెలిపారు.

చదవండి: DSC Free Training: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆసక్తి ఉన్నవారు మార్చి 26వ తేదీలోగా టీఎస్‌ ఎస్సీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన వారికి ఏప్రిల్‌ 3నుండి జూన్‌ 2వ తేదీ వరకు ఖమ్మంలో శిక్షణ ఉంటుందని వెల్లడించారు.
 

TS DSC 2024: విధివిధానాలు, రిజర్వేషన్లు, సిలబస్‌ ఇతర వివరాలతో బులెటిన్‌ విడుదల

రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 4న‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2 వరకూ కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, రిజర్వేషన్లు, సిలబస్‌ ఇతర వివరాలతో విద్యాశాఖ పూర్తి సమాచార బులెటిన్‌ను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో మార్చి 4న‌ విడుదల చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు సర్వర్‌ సమస్యల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. గతేడాది డీఎస్సీ తేదీలను ప్రకటించినా ప్రస్తుతం దీన్ని రద్దు చేశారు. 

అయితే అప్పుడు దరఖాస్తు చేసుకున్న 1.74 లక్షల మంది తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు ఇప్పటికే ప్రకటించినా ఈసారి 11,062 టీచర్‌ పోస్టులు ఉండటంతో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది టెట్‌ పాసయ్యారు. వారిలో చాలా మంది టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టెట్‌ ఉత్తీర్ణుల్లో చాలా మంది హైదరాబాద్‌లోని కోచింగ్‌ కేంద్రాల బాట పడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఓయూ సహా పలు విశ్వవిద్యాలయ లైబ్రరీల్లోనూ విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. మరోవైపు డీఎస్సీ సిలబస్‌తో కూడిన పుస్తకాలు రూపొందించే పనిలో ప్రచురణ సంస్థలు నిమగ్నమయ్యాయి. సబ్జెక్టు పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తుండటంతో పాత పుస్తకాలనే తిరిగి ముద్రించే పనిలో ఉన్నాయి.  

#Tags