Paramedical Diploma Courses : ఏపీఎస్ఏహెచ్పీసీలో వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. కోర్సుల వివరాలు..
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 1018.
జిల్లాల వారీగా ప్రభుత్వ కళాశాలలు
» ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం–విజయనగరం, విశాఖపట్నం.
» రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ–తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
» సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ–కృష్ణా.
» గుంటూరు మెడికల్ కాలేజీ–గుంటూరు, ప్రకాశం
» ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి– పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు.
» గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కడప– వైఎస్సార్ కడప.
» కర్నూలు మెడికల్ కాలేజీ– కర్నూలు.
» ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనంతపురం–అనంతపురం.
» ప్రభుత్వ మెడికల్ కాలేజీ, శ్రీకాకుళం–శ్రీకాకుళం
Scientist B Posts : బీఐఎస్లో సైంటిస్ట్-బీ పోస్టులకు దరఖాస్తులు..
కోర్సుల వివరాలు
» డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(డీఎంఎల్టీ).
» డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ(డీఎంఐటీ)
» డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్(డీవోఏ)
» డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ(డీడీఐఏఎల్వై)
» డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ(డీఆర్ఈఎస్టీ)
» డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటరీ టెక్నాలజీ(డీఎంఎస్టీ).
» డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజిన్ టెక్నాలజీ(డీఈఆర్ఎఫ్యూ)
» డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్(డీవోటీ)
» డిప్లొమా ఇన్ రేడియో £ð రపీ టెక్నీషియన్(డీఆర్టీటీ)
» డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు(డీడీఆర్ఏ)
» డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్(డీఆర్జీఏ)
» డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్సు(డీకార్డియో).
» డిప్లొమా ఇన్ కాత్ ల్యాబ్ టెక్నాలజీ(డీసీఎల్టీ)
» డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సు(డీఈసీజీ)
» డిప్లొమా ఇన్ అనెస్తీషియా టెక్నీషియన్ కోర్సు(డీఏఎన్ఎస్)
» డిప్లొమా ఇన్ మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్–మేల్(డీఎంపీహెచ్ఏ).
» అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్) దరఖాస్తు చేసుకోవాలి.
» వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి.
» కోర్సు వ్యవధి: రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.
» ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్లు మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
THSTI Jobs : టీహెచ్ఎస్టీఐలో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ!
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తుతో జతచేయాల్సిన సర్టిఫికేట్లు: పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇంటర్ సర్టిఫికేట్–మార్క్స్ షీట్లు, ఆరు నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ తదితరాలు
జత చేయాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.07.2024.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.08.2024.
» కౌన్సిలింగ్ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 19.08.2024.
» తరగతుల ప్రారంభం: 18.09.2024.
» వెబ్సైట్: https://apsahpc.co.in