Diploma Course Admissions : ఎన్‌ఐఈపీఐడీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే!

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

➨    మొత్తం సీట్ల సంఖ్య: 20.
➨    స్టైపెండ్‌: నెలకు రూ.2000.
➨    కోర్సు: డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌.
➨    అర్హత: కోర్సును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
➨    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
➨    ఎంపిక విధానం: విద్యార్హత మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
➨    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇంఛార్జ్, అకడమిక్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), మనోవికాస్‌ నగర్, సికింద్రాబాద్‌ చిరునామకు పంపించాలి.
➨    దరఖాస్తు ప్రారంభతేది: 29.07.2024
➨    దరఖాస్తులకు చివరితేది: 20.08.2024.
➨    వెబ్‌సైట్‌: https://www.niepid.nic.in

AP TET Total Applications 2024 : ఏపీ టెట్‌కు భారీగా దరఖాస్తులు.. ఈ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు.. కానీ..!

#Tags