Skip to main content

DEECET 2024 Notification: తెలంగాణ‌ డీఈఈసెట్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల..

తెలంగాణ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌..
Diploma in Elementary Education Common Entrance Test Notification 2024

2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్‌ ర్యాంక్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభు­త్వ డైట్‌లు/ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(మైనారిటీ, నాన్‌ మైనారిటీతో సహా)లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు
»    డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌).
»    డీపీఎస్‌ఈ(డిప్లొమా ఇన్‌ ప్రీ–స్కూల్‌ ఎడ్యుకేషన్‌).
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి. 
»    వయసు: కనిష్టంగా 01.09.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి లేదు.
»    ఎంపిక విధానం: డీఈఈసెట్‌లో సాధించిన ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 08.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 29.06.2024 నుంచి 30.06.2024 వరకు;
»    హాల్‌ టిక్కెట్ల జారీ తేది: 03.07.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 10.07.2024.
»    వెబ్‌సైట్‌:  https://deecet.cdse.telangana.gov.in

TS ICET 2024 Result Link :నేడే టీఎస్ ఐసెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఒకేఒక్క క్లిక్‌తో
 

Published date : 14 Jun 2024 10:40AM

Photo Stories