Skip to main content

AP HORTICET 2024: ఏపీ హార్టిసెట్‌–2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్‌) డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Academic year 2024-25  West Godavari District Andhra Pradesh India   Admission announcement poster for B.Sc Hons Diploma Course   AP HORTICET 2024 Notificaiton for admissions in diploma courses  YSR Horticultural University campus

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం సీట్ల సంఖ్య: 101
»    అర్హత: డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు).
»    ఎంపిక విధానం: ఏపీ హార్టిసెట్‌–2024, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపించాలి.
»    పరీక్ష కేంద్రాలు: పార్వతీపురం, వెంకటరామన్నగూడెం, అనంతరాజుపేట.
»    దరఖాస్తులకు చివరితేది: 15.06.2024.
»    పరీక్ష తేది: 26.07.2024.
»    వెబ్‌సైట్‌: https://drysrhu.ap.gov.in

Apprentice Posts: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

Published date : 29 May 2024 01:29PM

Photo Stories