Indian Army Recruitment 2024: అగ్నిపథ్‌ పథకం... సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌!

ఇండియన్‌ ఆర్మీ చెన్నైలోని జోన్‌ రిక్రూటింగ్‌ ఆఫీస్‌.. అగ్నిపథ్‌ పథకం కింద 2024-25 సంవత్సరం నియామకాలకు సంబంధించి సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ నియామకాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి(కరైకాల్, యానాం, పుదుచ్చేరి), అండమాన్‌ అండ్‌ నికోబార్, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. ఇందులో అర్హత సా«ధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపికచేస్తారు.
అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌ సైన్స్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్‌)లో కనీసం 50శాతం మార్కులు, ప్రతి సబ్జెక్టులో కనీసం 40«శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 17 1/2 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.03.2024.
ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

చదవండి: Indian Army Recruitment 2024: జెడ్‌ఆర్‌వో చెన్నైలో సిపాయి ఫార్మా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags