Indian Navy Recruitment: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం

ఇండియన్‌ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ బ్రాంచుల్లో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అ­వివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది.ఎంపికైన అభ్యర్థులకు బీటెక్‌ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.


మొత్తం ఖాళీలు: 40 (మహిళలకు 8 ఖాళీలు కేటాయించారు)

అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (10+2)(ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ మెయిన్‌–2021కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

Jobs In Post Office: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే


ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌ ఆల్‌ ఇండియా మెరిట్‌ ర్యాంక్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తులకు చివరి తేది: జులై 20, 2024

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

#Tags