Indian Coast Guard Recruitment 2024: తీరదళంలో కమాండెంట్‌ కొలువులు.. పరీక్ష ఇలా..

రక్షణ దళంలో పనిచేయాలనుకునే మహిళలకు భారతీయ తీర రక్షకదళం ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ పట్టభద్రులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష , ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

పోస్టులు, అర్హతలు
జనరల్‌ డ్యూటీ ఖాళీలు: 50. అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55శాతం మార్కులు అవసరం.
టెక్నికల్‌(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌) ఖాళీలు: 20. అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఇంటర్‌ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ కనీసం 55శాతం మార్కులు ఉండాలి.
వయసు
పై రెండూ పోస్టులకూ జూలై 01, 2024 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. 157సెం.మీ ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా
రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌ అండ్‌ మ్య­«థమెటికల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో విభాగంలోనూ 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించి­న వారిని మాత్రమే పేపర్‌-2కు ఎంపిక చేస్తారు. 
పేపర్‌-2లో భాగంగా కంప్యూటరైజ్డ్‌ కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్టు (సీసీబీటీ), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీఅండ్‌డీటీ) ఉంటాయి. సీసీబీటీని ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పీపీ అండ్‌ డీటీ కోసం ఇంగ్లిష్‌/హిందీలో మాట్లాడాలి. స్టేజ్‌-2 అర్హత పరీక్ష మాత్రమే ఇందులో ఎంపికైనవారికి స్టేజ్‌-3 నిర్వహిస్తారు.
స్టేజ్‌-3లో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూలు ఉంటాయి. స్టేజ్‌-3లో మెరిస్తే స్టేజ్‌-4 మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే స్టేజ్‌-1, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ రూపొందించి.. ఖాళీలకు అనుగుణంగా అర్హులను ట్రైనింగ్‌లోకి తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2024, మార్చి 06
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/

చదవండి: Indian Navy Recruitment 2024: 254 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags