Cash Rewards: పారాలింపిక్స్‌లో విజేతలకు నజరానా ఇచ్చిన క్రీడా శాఖ మంత్రి.. ఎంతంటే..

పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ సెప్టెంబ‌ర్ 10వ తేదీ ఘనంగా సన్మానించింది.

స్వర్ణ పతక విజేతకు రూ.75 లక్షలు, రజత పతకం నెగ్గిన వారికి రూ.50 లక్షలు. కాంస్య పతకం గెలిచిన వారికి రూ.30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 

లాస్‌ ఏంజెలిస్‌ 2028 పారాలింపిక్స్‌ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్‌ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు.  

Paris Paralympics Winners: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు.. విజేతలు వీరే..

#Tags