Euro Championship : యూరో చాంపియన్‌షిప్‌గా నిలిచి ఈ రికార్డును బ్రేక్ చేసిన స్పెయిన్‌..

ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను స్పెయిన్‌ గెలుచుకుంది.

ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను స్పెయిన్‌ గెలుచుకుంది. జర్మనీ వేదికగా నెలరోజులుగా కొనసాగిన ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో స్పెయిన్‌  2–1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. 12 ఏళ్ల తర్వాత యూరోకప్‌ ఫైనల్‌కు చేరిన స్పెయిన్‌ నాలుగోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 

World Taekwondo: వరల్డ్‌ తైక్వాండో కల్చర్‌ ఎక్స్‌పోలో భారత్‌కు ఏడు పతకాలు

ఆట తొలి అర్ధభాగంలో గోల్స్‌ కోసం ఇరుజట్లూ హోరాహోరిగా పోరాడినా ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి. కానీ రెండో అర్ధబాగంలో స్పెయిన్‌ తరఫున 47వ నిమిషంలో నికో విలియమ్స్‌ తొలి గోల్‌ కొట్టి ఆ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ జట్టు సారథి అల్వరొ మొరట స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్జాబల్‌.. 86వ నిమిషంలో మెరుపు వేగంతో గోల్‌ సాధించి స్పెయిన్‌ను 2-1 ఆధిక్యంలోకి తెచ్చాడు. 

ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా స్పెయిన్‌ ఏకంగా 15 గోల్స్‌ చేసింది. 1984లో ఫ్రాన్స్‌ 14 గోల్స్‌ చేసిన రికార్డు కనుమరుగైంది. 

#Tags