Thailand Open 2024: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుత విజయం సాధించింది
మే 19వ తేదీ జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యి జోడీపై 21-15, 21-15 తేడాతో ఘనంగా విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జోడీ తమ 9వ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ప్రపంచ నంబర్ 3 స్థానంలో ఉన్న ఈ భారత జోడీ, మొదటి నుండి చివరి వరకు తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఒక్కసారి కూడా ప్రత్యర్థి జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌లలో విజయం సాధించింది.
ఈ టైటిల్ విజయం, పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్, చిరాగ్ జోడికి మరింత ఊపునిస్తుంది. గత మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ జోడీ, మలేషియా సూపర్ 1000, ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!
#Tags