Skip to main content

Vinesh Phogat: స్పెయిన్‌ గ్రాండ్‌ ప్రిలో వినేశ్‌ ఫొగాట్‌కు స్వర్ణం

భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది.
Vinesh Phogat gets Gold at Spanish Grand Prix

మాడ్రిడ్‌లో జరిగిన స్పెయిన్‌ గ్రాండ్‌ ప్రిలో వినేశ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో వినేశ్‌ 10–5 స్కోరుతో మారియా తియుమెరికొవాపై విజయం సాధించింది. 
 
రష్యాకు చెందిన మారియా తటస్థ అథ్లెట్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌కు ముందు వినేశ్‌ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా మూడు బౌట్‌లలో గెలుపొందింది. యుజ్‌నీలిస్‌ గజ్‌మన్‌ (క్యూబా)పై 12–4తో, ఆ తర్వాత మాడిసన్‌ పార్క్స్‌ (కెనడా)పై ‘విన్‌ బై ఫాల్‌’తో, సెమీ ఫైనల్లో కేటీ డచక్‌ (కెనడా)పై 9–4తో వినేశ్‌ గెలిచింది. 

Neeraj Chopra: పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం

Published date : 09 Jul 2024 02:29PM

Photo Stories