Neeraj Chopra: పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం

ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌, భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్‌ నీర‌జ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు.

జూన్ 18వ తేదీ ఫిన్‌లాండ్‌లో జ‌రిగిన టోర్నీలో జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో త‌న మూడో ప్ర‌య‌త్నంలో నీర‌జ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకున్నారు.

ఈ గేమ్స్‌లో టోనీ కెరనెన్‌ (ఫిన్‌లాండ్‌; 84.19 మీటర్లు) రజతం నెగ్గగా.. ఒలివెర్‌ హెలాండర్‌ (ఫిన్‌లాండ్‌; 83.96 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. 
 
రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 82.58 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది నీరజ్‌ దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో రెండో స్థానాన్ని పొందగా.. భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ మీట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

Divya Deshmukh: ప్రపంచ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్ విజేతగా దివ్య.. ఈమె సాధించిన విజయాలు ఇవే..

#Tags