Most Valuable Player in Asian Games: ఆసియా క్రీడల్లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా జాంగ్, హైయాంగ్‌

ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు.
Most Valuable Player in Asian Games

1998  బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక  చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’ అవార్డు దక్కడం విశేషం.

Asian Games 2023 Archery: ఆర్చరీ జ్యోతి ఖాతాలో మరో స్వ‌ర్ణం

ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు  సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్‌ యుఫె, కిన్‌ హైయాంగ్‌లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్‌ జాంగ్‌ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్‌ హైయాంగ్‌ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్‌  దిగ్గజం లిన్‌ డాన్‌ (2010 గ్వాంగ్‌జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్‌ యుఫె, కిన్‌ హైయాంగ్‌ గుర్తింపు పొందారు.   

Asian Games 2023: జయహో భారత్‌ 107

#Tags