Paris Olympics: మనూ భాకర్ ఓటమి.. చేజారిన చారిత్రాత్మక పతకం
మెగా ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ఈమె ఆగస్టు 3వ తేదీ జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.
ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ.. మూడవ మెడల్ అందుకునే అవకాశాన్ని కోల్పోయింది.
ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. ఈ అవకాశం తృటిలో మిస్సైంది. 5 షాట్ టార్గెట్‌లో మనూ కేవలం మూడింటిని షూట్ చేసింది.
మొదటి నాలుగు స్థానాల్లో నిలిచింది వీరే..
➤ సౌత్ కొరియాకు చెందిన షూటర్ జిన్ యాంగ్‌కు స్వర్ణం
➤ ఫ్రాన్స్ చెందిన కమిలె జెడ్‌జివిస్కీకు రజతం
➤ హంగేరీ చెందిన వెరోనికా మేజర్‌కు కాంస్యం
➤ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్
Manu Bhakar: ఏ భారత ప్లేయర్‌కు సాధ్యంకాని రికార్డును సాధించేందుకు మనూ భాకర్ ‘సై’..!
భారత్ తరఫున అత్యధిక పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే..
➤ మనూ భాకర్ - షూటింగ్ - రెండు కాంస్యాలు - ప్యారిస్ ఒలింపిక్స్-2024
➤ నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్-ఇండియన్)- అథ్లెటిక్స్ - రెండు రజతాలు - ప్యారిస్ ఒలింపిక్స్ - 1900
➤ సుశీల్ కుమార్ - రెజ్లింగ్ - ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్ - 2012
➤ పీవీ సింధు - బ్యాడ్మింటన్ - ఒక రజతం, ఒక కాంస్యం - రియో ఒలింపిక్స్ - 2016, టోక్యో ఒలింపిక్స్ - 2020