NRAI President: జాతీయ రైఫిల్‌ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్

జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ దేవ్‌ ఎన్నికయ్యారు.

సెప్టెంబ‌ర్ 21వ తేదీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన రైఫిల్‌ సంఘం జనరల్‌ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్‌ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. 

కొన్నాళ్లుగా కాళికేశ్‌ ఎన్‌ఆర్‌ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్‌ సింగ్‌ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.

అప్పటినుంచి సీనియర్‌ ఉపాధ్యక్షుడైన కాళికేశ్‌ జాతీయ రైఫిల్‌ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు.  

Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం

#Tags