National Championship: జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ టైటిల్‌.. జార్ఖండ్‌ సొంతం

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో డిసెంబ‌ర్ 6వ తేదీ జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో జార్ఖండ్‌ విజేతగా అవతరించింది.

హోరాహోరీగా సాగిన తుది సమరంలో పుష్పా డాంగ్‌ సారథ్యంలోని జార్ఖండ్‌ జట్టు 1–0 గోల్‌ తేడాతో కృష్ణ శర్మ నాయకత్వంలోని మధ్యప్రదేశ్‌ జట్టును ఓడించింది. 

దీంతో గత ఏడాది రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న జార్ఖండ్‌ జట్టు ఈసారి మాత్రం విన్నర్స్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 4–3 గోల్స్‌ తేడాతో ఒడిశా జట్టుపై గెలిచింది. 

రూ.1 లక్ష ప్రైజ్‌మనీ..
విజేతగా నిలిచిన జార్ఖండ్‌ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రూ.3 లక్షలు, రన్నరప్‌ మధ్యప్రదేశ్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన మిజోరం జట్టుకు రూ.1 లక్ష ప్రైజ్‌మనీని ప్రకటించారు. 

272 మొత్తం 28 జట్లు పాల్గొన్న జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌. ఇందులో 191 ఫీల్డ్‌ గోల్స్, 76 పెనాల్టీ కార్నర్‌ గోల్స్, 5 పెనాల్టీ స్ట్రోక్‌ గోల్స్‌ ఉన్నాయి. 

Hockey Junior Asia Cup: ఐదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ నెగ్గిన టీమిండియా

#Tags